15, జులై 2012, ఆదివారం

కదళీవనం


శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే  అని ప్రశస్తి పొందిన భూ కైలాసం శ్రీశైలం.
అటువంటి శ్రీశైలం మహాక్షేత్రం లో ప్రతి అణువు శివమయం ప్రతి పర్వతం మేరునగతుల్యం
అలాంటి శ్రీశైల పర్వత సానువులలో నెలకొన్నపవిత్ర క్షేత్రం....
సిద్దపురుషులెందరికో నిలయమైన తపోవనం....

"కదళీవనం"

శ్రీశైల మహాపురాణం ప్రకారం సాధకుడు చుక్కల పర్వతం పైకెక్కి మూడు లక్షల 
పంచాక్షరిని జపిస్తేనే ఈ కదళీవనాన్ని దర్శించగలుగుతాడు
ఈ కదళీ వనంలో దత్తాత్రేయుని అవతార పరంపరలో మూడవ వారైనా
నృసింహసరస్వతి స్వామి వారు అదృశ్యమైనారు.
అక్కడే పరమ శివభక్తురాలు వైరాగ్య విరాజన్మూర్తి అక్కమహాదేవి సిద్ది పొందిన స్థలం.
కదళీవనంకు చేరుకోవాలంటే పాతాళగంగలో  ప్రయాణం చేసి నీలిగంగరేవు నుండి 
కీకారణ్యం లో కాలినడకన ప్రయాణం చేసి  చేరుకోవచ్చు.
నీలిగంగరేవు




నృసింహసరస్వతి స్వామి వారి గురించి
గురుచరిత్ర చదివిన వారికి ఈ కదళీవనం
గురించి స్వామి వారి గురించి తెలుస్తుంది.


స్వామి వారి జీవిత విశేషాలు



స్వామివారు మహారాష్ట్రలోని "కరంజా" పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో
మాధవుడు,అంబ అనే దంపతులకు నరహరి అనే పేరున జన్మించారు.
స్వామి వారి జన్మస్థలం

స్వామి వారి పాదుకలు

గర్భాష్టమమున ఉపనయనం గావించిరి.
ఉపనయనానంతరం తనకు సన్యాస దీక్షకు అనుమతి ఇవ్వవలసినదిగా ప్రార్థించగా 
వంశాకురం ఎట్లని తల్లి ప్రశ్నించగా  ఆమెకు ఇరువురు మగపిల్లలను ప్రసాదించి
అచటినుండి కాశీ పట్టణం చేరి కృష్ణ సరస్వతి అనే వృద్ధ సాధువును గురువుగానెంచి
సన్యాసాశ్రమ స్వీకారం చేసి  నృసింహసరస్వతి అను యోగపట్టాను పొంది మాధవుడనే 
బ్రాహ్మణునకు ఆశ్రమ దీక్షను ఇఛ్చి ప్రయాగ క్షేత్రం నుండి బయలుదేరి
నాసికా త్రయంబకంనకు వచ్చి అచట తనయొక్కమహిమలను ప్రదర్శించి 
అచట నుండి బయలుదేరి వైద్యనాధ క్షేత్రమునకు చేరి 
నృసింహవాడి లోని స్వామి వారి దృశ్యం
 అచట నుండి కొల్హాపుర్ సమీపంలోని నృసింహవాడి(నర్సోబా వాడి)  చేరి అచట
కృష్ణ పంచగంగా తీరం లో చతుష్షష్టి యోగిని దేవతల నుండి భిక్ష స్వీకరించుచు 
అచట 12 సంవత్సరములు ఉండి అచట తన పాదుకలు స్థాపించి అమరపురంనకు వెళ్ళెను.
అక్కడనుండి గంధర్వపురం అనే గాణగాపురంనకు చేరెను.




కల్లేశ్వర దేవాలయం
కల్లేశ్వర లింగం
అచట మొదట కల్లేశ్వరమునకు
 అక్కడనుండి సంగమానికిచేరెను.భీమా అమరజా నదీతీరములో అశ్వత్తవృక్షము క్రింద
 నివసిస్తూ భిక్షకై నగరంలోకి వస్తూ ఉండేవారు..స్వామి వారి మహిమను తెల్సుకున్న రాజు 
స్వామి వారిని సంగమంనుండి మఠానికి పల్లకిలో తీసుకుని మఠానికి వచ్చెను.
సంగమం లోని నృసింహసరస్వతి స్వామి వారి విగ్రహం
గాణగాపురంలోని  స్వామి వారి పాదుకలు
తరువాత స్వామి తన మహిమలను ప్రదర్శించిబహుధాన్య నామసంవత్సరం
 ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం నాడు శ్రీశైల మహాక్షేత్రానికి చేరి 
నేను నా స్థానముకు పోవుచున్నానుఅని తన నలుగురు శిష్యులు
 సాయందేవుడు,నంది,నరహరి,సిద్దుడు అను వారిచే పుష్పాసనం సిద్దం చేయించుకుని 
 నేను గుప్తరూపంలో గాణగాపురంలోనే ఉంటానని వారికి చెప్పి కృష్ణా నదిలో 
కదళీవనానికి సాగిపోయారు.
ఈ నలుగురు శిష్యులకు నాలుగు పుష్పాలు ప్రసాదించారు.
ఇలా స్వామివారు కదళీవనానికి చేరి అదృశ్యమయ్యారు.
కదళీవనం లోని గుహ

కదళీవనం లోని గుహ ప్రవేశద్వారం




అటువంటి పవిత్ర క్షేత్రంనకు సోమయాజుల రవీంద్రశర్మ గారుఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి
 10-02-2002 నాడు మొదటిసారి వెళ్ళారు.
అచట స్వామివారిని ధ్యానించగా స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం
కలిగింది.తరువాత 25-08-2002 నాడు ఘనంగా స్వామి వారి విగ్రహాన్ని 
కదళీవనంలో ప్రతిష్ఠించడం జరిగింది.
నృసింహసరస్వతి స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా దృశ్యం



09-07-2012 నాటి వార్షికోత్సవ దృశ్యం


ప్రతిష్ఠ జరిగిన తరువాత శ్రీశైల క్షేత్రం వారికి
ఈ కదళీ వనం గురించి శ్రీలలితా సేవాసమితి,తూప్రాన్ నుండి లేఖ రాయగా వారు
 తమ సంపాదక బృందాన్ని కదళీవనానికి పంపి అక్కడి విశేషాలను శ్రీశైల దేవస్థానం
మాసపత్రిక శ్రీశైల ప్రభలోను,శ్రీశైలం దర్శనీయ స్థలాలు అనే పుస్తకంలోనుప్రచురించి
 మా సంస్థను అభినందించారు.2002 నుండి 2012 వరకు 11 సార్లు కదళీవనం వెళుతూ 
అచట స్వామివారి సేవలో పాల్గొంటు ఉన్నాము
శ్రీశైల ప్రభ లో వచ్చిన కదళీవన వార్తా దృశ్యం

శ్రీశైల ప్రభ లో వచ్చిన కదళీవన వార్తా దృశ్యం


.
టపా విస్తరణ భీతితో సంక్షేపించాను
స్వామి వారి మహిమలు అసంఖ్యాకాలు,అనిర్వచనీయాలు
స్వామి వారి సంపూర్ణ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే 
శ్రీ గురుచరిత్రను పారాయణ చేయండి.