31, మార్చి 2011, గురువారం

ఉగాది పర్వదినం


నిషస్సు నెక్కె ఉషస్సు ఎదపై చెక్కిన యశశ్శిల్పమే
" ఈ యుగాది"
అరిషడ్వర్గపు అరిహస్తాలను ఖండించే సూర్యకిరణపు
కరవాలాలను నిలిపిన వేదిక
"ఈ యుగాది"
వికృతి నామపు విపరీతాలను
విశేషాలను తనలో నుంచిన
ఖర నామపు స్వాగత తోరణం
"ఈ యుగాది"
ఉత్పలమాలను చంపకమాలను మెడను ధరించి
మత్తేభమ్ముల,శార్ధూలమ్ముల వాహనమ్ముల గావించి
కోటి కోకిలల కుహుగానములను
నాదస్వరముల గానముల మేళవించి
ప్రశాంత ప్రాగ్వేదికపై
ఉషాకిరణాల దిశారాగమే
" ఈ యుగాది"
షట్శాస్ర్తమ్ముల సారమ్ములను
షడ్రుచులుగా మలిచి
దశాదిశావేదికపై ఉదయించు
నవగ్రీష్మ తేజమే
"ఈ యుగాది"