25, డిసెంబర్ 2010, శనివారం

మా మెతుకుసీమ(మెదక్)

రాణులు ఏలిన సీమ మా మెతుకుసీమ

వీరనారుల విజయ గాథ మా మెతుకుసీమ

రత్నాలు దొరికిన సీమ మా మెతుకుసీమ

స్త్రీ శక్తి కి నిదర్శనం మా మెతుకుసీమ.

కేతకి సంగమేశ్వర ప్రాంగణం మా మెతుకుసీమ

ఏడుపాయల వనదుర్గా ఆశీర్వాదం మా మెతుకుసీమ

వీణాపాణి కొలువైన నిలయం మా మెతుకుసీమ

ఏసుక్రీస్తు నిలయం మా మెతుకుసీమ

మంజీరమ్మ ప్రచండ ప్రవాహం మా మెతుకుసీమ

18, డిసెంబర్ 2010, శనివారం

అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము


లంకాయాం శాంకరీ దేవి,కామాక్షీ కాంచికాపురే,

ప్రద్యుమ్నే శృంఖళా దేవి,చాముండే క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా,

కొల్హాపురే మహలక్ష్మి,మాహుర్యే ఏకవీర్యకా,

ఉజ్జయిన్యాం మహంకాళీ,పీఠీకాయాం పురుహూతికా

ఓడ్యాణే గిరిజాదేవి,మాణిక్యే దక్షవాటికా

హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవిదేవి గయా మాంగళ్యగౌరికా

వారణాస్యే విశాలాక్షి,కాశ్మీరేతు సరస్వతి

అష్టాదశ శక్తి పీఠాని యోగినామతి దుర్లభం,

సాయంకాలం పఠేన్నిత్యం ,సర్వశతృవినాశనం

సర్వదివ్యహరం రోగం సర్వ సంపత్కరం శుభం

నా తెలుగు సౌరభాలు

శార్వాణి వీణియపై మీటే రాగపు  రవళియే నా తెలుగు
ఆదికవి శరత్కాలపు వెన్నెలయే నా తెలుగు
పోతన భాగవతపు భాగ్యమే నా తెలుగు
మల్లినాధుడే వెలసిన దేశము నా తెలుగు



శార్వాణి వీణియపై మీటే రాగపు  రవళియే నా తెలుగు 

వాణీ నా రాణి యన్న వీరభద్రుని వీచికయే నా తెలుగు
వేములవాడ వేదికపై వెలసిన భీముని కావ్యమే నా తెలుగు
వేంకటపతిపై వేల గానముల అన్నమయ్య పదకేళియే నా తెలుగు
అష్టదిగ్గజముల సాహిత్య ధగధగలే నా తెలుగు
రామతత్త్వమును భోదించే గోపన్న గీతమే నా తెలుగు


శార్వాణి వీణియపై మీటే
రాగపు రవళియే నా తెలుగు 

కత్తి లాంటి కలమును ధరించిన కాళోజి కవితయే నా తెలుగు
శ్రీశ్రీ కావ్యపు శ్రీమంతమే నా తెలుగు
విశ్వనాధుని కిన్నెరసానియే నా తెలుగు
సినారె సినీ గీత సౌరభం నా తెలుగు

శార్వాణి వీణియపై మీటే
రాగపు  రవళియే నా తెలుగు 

సాక్షాత్ చండిక రుద్రమ్మ నడచిన నేలయే  నా తెలుగు
ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే నా తెలుగు
మల్కిభరాముని మణిమయ రాజ్యమే నా తెలుగు
వేంగి చాళుక్య వైభవం నా తెలుగు 


శార్వాణి వీణియపై మీటే
రాగపు  రవళియే నా తెలుగు 

ఏడుపాయల వనదుర్గ జాతరయే నా తెలుగు
గిరిజన సంస్కృతి భాసిల్లే మేడారం శోభయే నా తెలుగు
మెతుకుసీమకే మెరుగులు దిద్దిన చర్చి గంటల ధ్వనులే నా తెలుగు
గౌరమ్మ రూపమై విలసిల్లే బతుకమ్మ తేజమే నా తెలుగు
షడ్రుచుల సంగమ ఫలితం నా తెలుగు


శార్వాణి వీణియపై మీటే
రాగపు  రవళియే నా తెలుగు