15, డిసెంబర్ 2012, శనివారం

స్వాగత సుమాంజలి

27, నవంబర్ 2012, మంగళవారం

కార్తీక సోమవార వ్రతము






వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన 
సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్దగా ఆలకించండి
ఈ నెలలో శివ ప్రీతిగా సోమవార వ్రతమాచరించేవాడు తప్పనిసరిగా
కైలాసాన్ని చేరుకుంటాడు.కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము 
నాడయిన సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి
అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు.
ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంది
౧.ఉపవాసము
౨.ఏకభుక్తము
౩.నక్తము 
౪.అయాచితము
౫.స్నానము
౬.తిలదానము

౧.ఉపవాసము
శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసముతో
గడిపి,సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనాంతరమున
తులసీతీర్థము మాత్రమే స్వీకరించాలి.

౨.ఏకభుక్తము
సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నాన దాన జపాదులను యధావిధిగా 
చేసికొని మధ్యాహ్నమున భోజనం చేసి.రాత్రి భోజనానికి బదులు
శైవతీర్థమో,తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

౩.నక్తము 
పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనము గాని
ఉపాహారమును గాని స్వీకరించాలి.

౪.అయాచితము
భోజనానికై తాము ప్రయత్నించకుండా యెవరైనా వారికి వారుగా 
పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము.

౫.స్నానము
పై వాటికి వేటికి శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నాన జపాదులు
చేసినప్పటికిని చాలును 

౬.తిలదానము
మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు
నువ్వులను దానము చేసినా సరిపోతుంది

పై ఆరు పద్ధతులలో దేనినాచరించినా కార్తిక సోమవార వ్రతము చేసినట్లే
అవుతుంది.ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు
సాయుజ్యమును పొందుతారు.కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము 
నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనము అనంతరము
భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవారు తప్పనిసరిగా 
శివ సాయుజ్యాన్ని పొందుతారు..

6, నవంబర్ 2012, మంగళవారం

వజ్ర పంజర దుర్గా కవచము


శ్లో|| నమోదేవి ! జగద్ధాత్రి: జగత్రయ మహారణే
మహేశ్వరీ:మహాశక్తే:దైత్యదృమ కుఠారికే

''త్రైలోక్యవ్యాపిని:శివే:శంఖ చక్ర గదాధరి
స్వశార్జవగ్ర హస్తాగ్రే: నమో విష్ణు స్వరూపిణి

   ''హంసయానే: నమస్తుభ్యం-సర్వసృష్టి విధాయిని
ప్రాచాం వాచాం జన్మభూమే చతురానన రూపిణి

 ''త్వమైంద్రి! త్వంచకౌబేరి - వాయవీత్వం త్వమంబుపా
త్వం యామీ నైరృతి త్వంచ త్వమైశీ! త్వంచ పావకీ

''శశాంక కౌముదీ త్వంచ - సౌరశక్తి స్త్వమేవచ
                      సర్వదేవమయీ శక్తి:త్వమేవ పరమేశ్వరి                     5


శ్లో||త్వం గౌరి త్వంచ సావిత్రి త్వం గాయత్రి సరస్వతీ
  ప్రకృతి స్వ్తం మతిస్త్వంచ- త్వం మహాకృతి రూపిణి

''చేత:స్వరూపిణి త్వం వై- త్వం సర్వేంద్రియ రూపిణి
పంచతత్వ్త స్వరూపాత్వం - మహాభూతాత్మికాంబికే

''శబ్దాది రూపిణి త్వంవై- కరుణానుగ్రహదాయినీ
బ్రహ్మండ కర్త్రీ త్వందేవి - బ్రహ్మాండాంత స్త్వమేవ హి 

''త్వం పరాసి మహాదేవి !త్వంచదేవి !పరా౭పరా
పరా౭పరాణాం పరమా!పరమాత్మ స్వరూపిణి 

''సర్వరూపాత్వమీశాని!త్వమరూపాసి సర్వగే
                త్వంచిచ్ఛక్తిర్మహామాయే - త్వం స్వాహాత్వం స్వధామృతే             10

''వషడ్వౌషట్ స్వరూపాసి ­- త్వమేవ ప్రణవాత్మికా
సర్వమంత్రమయీ త్వంవై­- బ్రహ్మద్యస్త్వత్సముద్భవా:

శ్లో||చతుర్వర్గత్మికా త్వంవై- చతుర్వర్గ ఫలోదయే
త్వత్త:సర్వమిదం విశ్వం - త్వయి సర్వం జగన్నిధే

''యద్ద్రృశ్యం యదదృశ్యంచ- స్థూల సూక్ష్మ స్వరూపత:
తత్రత్వం శక్తి రూపేణ - కించిన్న త్వదృతే క్వచిత్

''మాత స్త్వయాద్య వినిహత్య మహా సురేంద్రమ్
దుర్గం నిసర్గ విబుధార్పిత దైత్య సైన్యమ్ 
త్రాతా:స్మదేవి !సతతం- నమతాం శరణ్యే
త్వత్తోపర:కఇహ యం శరణం వ్రజామ:

''లోకేత ఏవ ధనధాన్య్ సమృద్ధి భాజ:
తేపుత్ర పౌత్ర సుకళత్ర సుమిత్ర వంత:
తేషాం యశ: ప్రసర చంద్ర కరావదాతమ్
                           విశ్వంభవేద్భవసి యేషు సుదృక్ త్వమీశే                    15

''త్వద్భక్తి చేతసి జనేన విపత్తి లేశ:
కేశ:క్వవాసు భవతీ నతికృత్సు పుంసు
త్వన్నామ సంసృతి జుషాం సకలాయుషాం క్వ
భూయ: పునర్జనిరిహ త్రిపురారి పత్ని

''చిత్రం యదత్ర సమరే సహి దుర్గదైత్య:
త్వదృష్టిపాత మధిగమ్య సుధానిదానమ్
మృత్యోర్మశత్వ మగమ ద్విదితం భవాని
దుష్టోపి తే దృశిగత: కుగతిం నయాతి

''తచ్చస్త్ర వహ్ని శలభత్వ మితా అపీహ
దైత్యా:పతంగ రుచి మాప్య దివం వ్రజంతి
సంత: ఖలేష్వపిన దుష్టధియో యత:స్యు:
సాధుష్వివ ప్రణయిన:స్వపథం దిశంతి 

''ప్రాచ్యాం మృడాణి! పరిపాహి!సదా నతాన్నో
యామ్యా మవ!ప్రతిపదం విపదో భవాని!
ప్రత్యగ్దిశి త్రిపురతా వనపత్ని!రక్ష!
త్వంపాహ్యు దీచిహే నిజభక్త జనాన్మహేశి

''బ్రహ్మణి ! రక్ష! సతతం- నతమౌళి దేశమ్
త్వం వైష్ణవి ! ప్రతికులం పరిపాలయాధ:
రుద్రాగ్ని!నైరృతి సదాగతి దిక్షుపాంతు
                          మృత్యుంజయాత్రి నయన! త్రిపురాత్రి శక్త్య:                20

''పాతు త్రిశూల మమలే తవమౌళి జాన్నో
ఫాలస్ధలం శశికళా భృదుమాభృవౌచ
నేత్రే త్రిలోచన వధూర్గిరిజాచ నాసామ్
ఓష్ఠం జయాచ విజయా త్వధర ప్రదేశమ్

''శ్రోత్రద్వయం శృతిరవా దశనా వళీం శ్రీ
చండీ కపోళ యుగళం,రసనాంచ వాణీ
పాయాత్ సదైవ చుబుకం,జయ మంగళాన:
కాత్యాయనీ వదన మండల  మేవ సర్వమ్

''కంఠప్రదేశమవతా దిహ నీలకంఠీ !
భూదార శక్తిరనిశంచ కృకాటికాయామ్
కౌర్త్మ్యం సదేశమనిశం భుజదండ మైంద్రీ
పద్మాచ పాణి ఫలకం,నతికారిణాం న

''హస్తాంగుళీ :కమలజా విరజానహాంశ్చ
కక్షాంతరం తరణి మండలగా తమోఘ్ని
వక్ష:స్థలం స్థలచరీ,హృదయం ధరిత్రీ
కుక్షి ద్వయం త్వవతు న:క్షణదా చరఘ్నీ

''అవ్యాత్ సదోదరదరీం జగదీశ్వరీ నో
నాభిం నభోగతి రజాత్వధ పృష్ఠదేశమ్
పాయాత్కటించ వికటా,పరమాస్పదౌ నో
                             ఊహ్యంగుహరణి రపాన మపాయ హంత్రీ                       25

''ఊరుద్వయంచ విపులా లలితాచజాను
జంఘే జవావతు కఠోర తరాత్ర గుల్భౌ
గుల్భౌరసాతల చరాంగుళీ దేశముగ్రా
చాంద్రీ నఖాన్ పదతలం తలవాసినీచ

శ్లో|| గృహం రక్షతు నో లక్ష్మీ క్షేత్రం క్షేమకరీ సదా
పాతు పుత్రాన్ ప్రియకరీ పాయాదాయు: సనాతనీ

''యశ:పాతు మహాదేవి ధర్మం పాతు ధనుర్థరీ
కులదేవి కులం పాతు సద్గతిం సద్గతి ప్రదా

''రణే రాజకులే ద్యూతే సంగ్రామే శత్రుసంకటే 
                          గృహే వనే జలాదౌ చ శర్వాణీ సర్వతో౭వతు                   29

ఫల శృతి:

శ్లో|| ఏతత్ స్తోత్రస్య కవచం - పరిధాస్యతి యోనర:
తస్య క్వచిద్వయం నాస్తి - వజ్ర పంజర గస్య హి

''అనయాకవచం కృత్వా - మాబిభేతు యమాదపి
భూతప్రేత పిశాచాశ్చ- శాకిని ఢాకినీ గణా:

''వాత పిత్తాది జనితా: -తథాచ విషమ జ్వరా:
దూరదేవ పలాయంతే -శృత్వాస్తుతి మిమాం శుభామ్

''వజ్రపంజరనామైతత్- స్తోత్రం దుర్గా ప్రశంసనమ్
ఏతత్ స్తోత్ర కృతత్రాణే - వజ్రాదపి భయం నహి

''అష్టజప్తేన చానేన - యోభిమంత్ర్య జలం పిభేత్
తస్యోదరగతా పీడా- క్వాపినో సంభవిష్యతి

''గర్భపీడాతు నోజాతు - భవిష్యత్యభి మంత్రణాత్
బాలానాం పరమా శాంతి : ఏతత్ స్తోత్రంబు పానత:


28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

దారిద్ర్య దహన స్తుతి


విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



గౌరి ప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దు:ఖ భవసాగర తారణాయ 
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీర పాద యుగళాయ జటాధరాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనందభూమి వరదాయ తమోమయాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



భాను ప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



రామప్రియాయ రఘునాధ వరప్రదాయ
నామప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేశు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ



ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ   
దారిద్య్ర దు:ఖ దహనాయ నమశ్శివాయ

15, జులై 2012, ఆదివారం

కదళీవనం


శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే  అని ప్రశస్తి పొందిన భూ కైలాసం శ్రీశైలం.
అటువంటి శ్రీశైలం మహాక్షేత్రం లో ప్రతి అణువు శివమయం ప్రతి పర్వతం మేరునగతుల్యం
అలాంటి శ్రీశైల పర్వత సానువులలో నెలకొన్నపవిత్ర క్షేత్రం....
సిద్దపురుషులెందరికో నిలయమైన తపోవనం....

"కదళీవనం"

శ్రీశైల మహాపురాణం ప్రకారం సాధకుడు చుక్కల పర్వతం పైకెక్కి మూడు లక్షల 
పంచాక్షరిని జపిస్తేనే ఈ కదళీవనాన్ని దర్శించగలుగుతాడు
ఈ కదళీ వనంలో దత్తాత్రేయుని అవతార పరంపరలో మూడవ వారైనా
నృసింహసరస్వతి స్వామి వారు అదృశ్యమైనారు.
అక్కడే పరమ శివభక్తురాలు వైరాగ్య విరాజన్మూర్తి అక్కమహాదేవి సిద్ది పొందిన స్థలం.
కదళీవనంకు చేరుకోవాలంటే పాతాళగంగలో  ప్రయాణం చేసి నీలిగంగరేవు నుండి 
కీకారణ్యం లో కాలినడకన ప్రయాణం చేసి  చేరుకోవచ్చు.
నీలిగంగరేవు




నృసింహసరస్వతి స్వామి వారి గురించి
గురుచరిత్ర చదివిన వారికి ఈ కదళీవనం
గురించి స్వామి వారి గురించి తెలుస్తుంది.


స్వామి వారి జీవిత విశేషాలు



స్వామివారు మహారాష్ట్రలోని "కరంజా" పట్టణంలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో
మాధవుడు,అంబ అనే దంపతులకు నరహరి అనే పేరున జన్మించారు.
స్వామి వారి జన్మస్థలం

స్వామి వారి పాదుకలు

గర్భాష్టమమున ఉపనయనం గావించిరి.
ఉపనయనానంతరం తనకు సన్యాస దీక్షకు అనుమతి ఇవ్వవలసినదిగా ప్రార్థించగా 
వంశాకురం ఎట్లని తల్లి ప్రశ్నించగా  ఆమెకు ఇరువురు మగపిల్లలను ప్రసాదించి
అచటినుండి కాశీ పట్టణం చేరి కృష్ణ సరస్వతి అనే వృద్ధ సాధువును గురువుగానెంచి
సన్యాసాశ్రమ స్వీకారం చేసి  నృసింహసరస్వతి అను యోగపట్టాను పొంది మాధవుడనే 
బ్రాహ్మణునకు ఆశ్రమ దీక్షను ఇఛ్చి ప్రయాగ క్షేత్రం నుండి బయలుదేరి
నాసికా త్రయంబకంనకు వచ్చి అచట తనయొక్కమహిమలను ప్రదర్శించి 
అచట నుండి బయలుదేరి వైద్యనాధ క్షేత్రమునకు చేరి 
నృసింహవాడి లోని స్వామి వారి దృశ్యం
 అచట నుండి కొల్హాపుర్ సమీపంలోని నృసింహవాడి(నర్సోబా వాడి)  చేరి అచట
కృష్ణ పంచగంగా తీరం లో చతుష్షష్టి యోగిని దేవతల నుండి భిక్ష స్వీకరించుచు 
అచట 12 సంవత్సరములు ఉండి అచట తన పాదుకలు స్థాపించి అమరపురంనకు వెళ్ళెను.
అక్కడనుండి గంధర్వపురం అనే గాణగాపురంనకు చేరెను.




కల్లేశ్వర దేవాలయం
కల్లేశ్వర లింగం
అచట మొదట కల్లేశ్వరమునకు
 అక్కడనుండి సంగమానికిచేరెను.భీమా అమరజా నదీతీరములో అశ్వత్తవృక్షము క్రింద
 నివసిస్తూ భిక్షకై నగరంలోకి వస్తూ ఉండేవారు..స్వామి వారి మహిమను తెల్సుకున్న రాజు 
స్వామి వారిని సంగమంనుండి మఠానికి పల్లకిలో తీసుకుని మఠానికి వచ్చెను.
సంగమం లోని నృసింహసరస్వతి స్వామి వారి విగ్రహం
గాణగాపురంలోని  స్వామి వారి పాదుకలు
తరువాత స్వామి తన మహిమలను ప్రదర్శించిబహుధాన్య నామసంవత్సరం
 ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం నాడు శ్రీశైల మహాక్షేత్రానికి చేరి 
నేను నా స్థానముకు పోవుచున్నానుఅని తన నలుగురు శిష్యులు
 సాయందేవుడు,నంది,నరహరి,సిద్దుడు అను వారిచే పుష్పాసనం సిద్దం చేయించుకుని 
 నేను గుప్తరూపంలో గాణగాపురంలోనే ఉంటానని వారికి చెప్పి కృష్ణా నదిలో 
కదళీవనానికి సాగిపోయారు.
ఈ నలుగురు శిష్యులకు నాలుగు పుష్పాలు ప్రసాదించారు.
ఇలా స్వామివారు కదళీవనానికి చేరి అదృశ్యమయ్యారు.
కదళీవనం లోని గుహ

కదళీవనం లోని గుహ ప్రవేశద్వారం




అటువంటి పవిత్ర క్షేత్రంనకు సోమయాజుల రవీంద్రశర్మ గారుఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి
 10-02-2002 నాడు మొదటిసారి వెళ్ళారు.
అచట స్వామివారిని ధ్యానించగా స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం
కలిగింది.తరువాత 25-08-2002 నాడు ఘనంగా స్వామి వారి విగ్రహాన్ని 
కదళీవనంలో ప్రతిష్ఠించడం జరిగింది.
నృసింహసరస్వతి స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా దృశ్యం



09-07-2012 నాటి వార్షికోత్సవ దృశ్యం


ప్రతిష్ఠ జరిగిన తరువాత శ్రీశైల క్షేత్రం వారికి
ఈ కదళీ వనం గురించి శ్రీలలితా సేవాసమితి,తూప్రాన్ నుండి లేఖ రాయగా వారు
 తమ సంపాదక బృందాన్ని కదళీవనానికి పంపి అక్కడి విశేషాలను శ్రీశైల దేవస్థానం
మాసపత్రిక శ్రీశైల ప్రభలోను,శ్రీశైలం దర్శనీయ స్థలాలు అనే పుస్తకంలోనుప్రచురించి
 మా సంస్థను అభినందించారు.2002 నుండి 2012 వరకు 11 సార్లు కదళీవనం వెళుతూ 
అచట స్వామివారి సేవలో పాల్గొంటు ఉన్నాము
శ్రీశైల ప్రభ లో వచ్చిన కదళీవన వార్తా దృశ్యం

శ్రీశైల ప్రభ లో వచ్చిన కదళీవన వార్తా దృశ్యం


.
టపా విస్తరణ భీతితో సంక్షేపించాను
స్వామి వారి మహిమలు అసంఖ్యాకాలు,అనిర్వచనీయాలు
స్వామి వారి సంపూర్ణ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే 
శ్రీ గురుచరిత్రను పారాయణ చేయండి.



17, జూన్ 2012, ఆదివారం

ప్రహేళిక-2


సమాధానం కనుగొనండి


1.అంచిత చతుర్థజాతుడు
   పంచమ మార్గమున నేగి
   ప్రధమ తనూజన్
   గాంచి తృతీయం బక్కడ 
   నుంచి ద్వితీయంబు దాటి
   యొప్పుగ వచ్చెన్




2.నక్షత్రము గల చిన్నది
   నక్షత్రము చేత బూని నక్షత్ర ప్రభున్
   నక్షత్రమునకు రమ్మని 
   నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్

19, మే 2012, శనివారం

ప్రహేళిక



"సమాధానం కనుగొనండి"


కేశవం పతితం దృష్ట్వా పాండవా:హర్షనిర్భర:
రుదంతి కౌరవాస్సర్వే హా హా కేశవ కేశవా




16, మే 2012, బుధవారం

శ్రీ దత్తాత్రేయాష్టకమ్





శ్రీ వేదాంత విచార వినిర్గత సారాకార సదానందం
భక్తిజ్ఞాన విధాతారం శుభదాకారం సుఖదాతారం
      విద్వన్మండల మండిత తారాది పసమ భాసుర వేదమయం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

విష్ణుబ్రహ్మ మహాదేవంశాజ్ఞాత జగద్ఘనలోకగురుం
కౌపీనాంబర మాత్రవిభాసిత సర్వవ్యాప్త శుభాకరం
శ్వానాకార లసద్వేదై:పరివేష్టిత భక్తాభీష్టకరం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

మందస్మేర లసన్ముఖమండల దర్శన దూరీకృతతాపం
దేవేంద్రాది సురైరాభివందిత సుందరమృదుపాదద్వంద్యం
విశ్వవ్యాప్త మహాంతం సుఖదానంతం సద్గుణమణిదాంతం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

వాణీశైక ముఖం లక్ష్మీరమణైక ముఖం సకలాత్మ సుఖం
భాస్వచ్చంద్రఝటాంచిత గౌరీశైకాంభోజముఖం
బాధాతప్త హృదాకాశోల్లసితానందేందు సమాచారం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

అనసూయా త్రితప:ఫలజాతం స్వానందాత్మసుఖోపేతం
జ్ఞానాంజన దూరీకృత జీవాజ్ఞానాంధ తమస్సముదాయం
త్రిగుణైర్యుతమపి త్రిగుణాతీతం కృతదుర్గుణ జన విద్వంసం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

నిస్సంగం నిర్మోహశుభాంగం నిత్యానందాబ్దితరంగం
నిర్విషయా సక్తతయా సేవిత భక్త హృదంతర్నిజవాసం
క్రూరజనోపరిసారితదృష్ట్యా దూరీకృతతన్మతి మాంద్యం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

ప్రాణాదిమ పంచద్వయవాయు జగద్వ్యాప్తం నతదీనాప్తం
నానాభౌతిక దేహంతస్థితి విజ్ఞానాత్మక నిజశక్తిం
త్వన్నామస్మరణేనోచ్చాటిత భూతప్రేతభయోత్పాతం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

భేదాభావవిశుద్ధ స్వాంతం వేదాంతనిహిత శుద్ధాంతం
భోధానంతకృతాంభోధిం శ్రితసాధుజనావనవిమలాధి
వేదామ వచనై ర్వేద్యంసంసార మయహరనిజవైద్యం
దత్తాత్రేయ విభుం హృదిసేవే జ్ఞానానందఘనస్వాంతం

ఇదం స్తోత్రం పఠేద్యొవై శ్రీనాధేభిభాషితం
సదత్త వరదానేన సర్వాభీష్టాన్యవాప్నుయాత్
ఇదం బర్దీపురం శ్రీ దత్తదేవతార్పణమస్తు
-----గౌరిభట్ల శ్రీనాధ శర్మ

27, ఫిబ్రవరి 2012, సోమవారం

శ్రీమచ్ఛంకరభగవత్పూజ్యపాద విరచిత మంత్రమాతృకాపుష్పమాలాస్తవః









౧.కల్లోలల్లసితా మృతాబ్ధి లహరిమధ్యే,విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే  రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే  విమానోత్తమే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే!!

౨.ఏణాంకానల భానుమండల లసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం,కరతలైఃపాశాంకుశౌబిభ్రతీం
బాపం బాణమపి ప్రసన్నవదనాం,కౌసుంభవస్త్రాన్వితాం,త్వాంచంద్రకళావతంసమకుటాం,చారుస్మితాం భావయే!!

౩.ఈశానాది పదం,శివైకఫలకం,రత్నాసనంతేశుభం,పాద్యం కుంకుమ చందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః
శుద్ధేరాచమనీయం తవజలైర్భక్త్యామయాకల్పితం,కారుణ్యామృతవారధే,తధఖిలం సంతుష్టయే కల్ప్యతాం!!

౪.లక్ష్యే యోగిజనస్య లక్షిత జగజ్జాలే,విశాలేక్షణే,ప్రాలేయాంబు పటిర కుంకుమలసత్కర్పూర మిశ్రోదకైః గోక్షీరై
రపినారికేళసలిలశ్శుద్ధోనకైర్మంత్రితైఃస్నానం దేవి ధియామయై తధఖిలం సంతుష్టయే కల్ప్యతాం!!

౫.హ్రీంకారాంకిత మంత్రలక్షితతనో,హేమాంచలాత్సంతితై రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుభవర్ణాంశుకం
  ముక్తసంతతి యజ్ఞసూత్రమమలం,సౌవర్ణతంతూద్భవం,దత్తందేవి ధియామయై తధఖిలం సంతుష్టయే కల్ప్యతాం!!

౬.హంసైరప్యపి లోభనీయగమనే,హోరావళీ ముజ్జ్వలాం,హిందోళద్యుతి హీరపూరితతరే,హేమాంగధే కంకణే
మంజీరౌమణికుండలే,మకుట మప్యర్థేందు చూడామణిం,నాసామౌక్తిక మంగుళీయకటకౌ,కాంచీమతి స్వీకురు!!

౭.సర్వాంగే ఘనసార కుంకుమ ఘనశ్రీగంధ పంకాంకితాం,కస్తూరి తిలకంచ ఫాలఫలకే,గోరోచనాపత్రకం గండా దర్శన
మండలే,నయనయోర్దివ్యాంజనంతేంచితం,కంఠాబ్దే మృగనాభి పంకకమలం త్వత్ప్రీతయేకల్ప్యతాం!!

౮.కల్హారోత్పల మల్లికామరువకై సౌవర్ణపంకేరుహైఃజాజీచంపక మాలతీ వకుళకైర్మందార కుందాదిభిఃకేతక్యా
కరవీరకైర్భహువిధై క్లప్తాస్రజోమాలికాః సంకల్పేన సమర్పయామివరదే ,సంతుష్టయే గృహ్యతాం!!

౯.హంతారం మదనస్య నందయసీయైరంగై రసంగోజ్జ్వలై: భృంగావళి నీలకుంతలభరైర్బద్నా సీతస్యాశయం 
తానీమానితవాంబ కోమల తరణ్యామోదలీలా గృహణ్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతైర్థూపై రహంధూపయే!!

౧౦.లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోద్భాసాంతరీ మందిరే,మాలారూప విళంబితైర్మణిమయ స్తంభేషు సంభావితైః
చిత్రైర్హాటక పుత్రికాం కరధృతైఃగృవైఘృతై ర్వర్థితైఃదివైద్దీప గణైర్థియా గిరిసుతే సంతుష్టయే కల్ప్యతాం!!

౧౧.హ్రీంకారేశ్వరి తప్తహాటకృతైఃస్థాలీ సహస్రైర్బృతం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్ర్రాన్నభేదంతథా దుగ్దాన్నం
మధు శర్కరాదధియుతం మాణిక్య పాత్రేస్థితం,మాషాపూప సహస్రమంబబ్ సఫలం నైవేద్యమావేదయే!!

౧౨.సచ్ఛాయైర్వర కేతకీదళరుచా,తాంబులవల్లీదళైః పూగైర్భూరి గుణై స్సుగంధ మధురైఃకర్పూరఖండోజ్జ్వ్లలైః 
ముక్తాచూర్ణ విరాజితైర్బహువిదైర్వక్త్రాంబుజామోదితై పూర్ణరత్న కళాచికా తవముదేన్యస్తా పురస్తాదుమే!!

౧౩.కన్యాభిఃకమనీయకాంతిభి రలంకారామలారార్తికా పాత్రే మౌక్తిక చిత్ర పంక్తి విలసత్కర్పూరదీపాళిభిః తత్తత్తాళ
మృదంగ గీత సహితం నృత్యత్పదాంబోరుహం ,మంత్రారాధన పూర్వకం,సునిహితం,నీరాజనం గృహ్యతాం!!

౧౪.లక్ష్మీర్మౌక్తిక లక్ష కల్పిత సితచ్ఛత్రంతుధత్తే రసాత్ ఇంద్రాణీచ రతితిశ్చ ఛామరవరేధతే స్వయంభారతీ
వీణామేణ విలోచనాసుమనసాం,నృత్యతిసంరాగన్యతే,భావైరాంగిక సాత్వికైఃస్ఫటరసం మాత్వస్త సూకర్ణ!!

౧౫.హ్రీంకారత్రయ సంపుటేన మనునోస్యీత్రయా మౌళిభిర్యాకై ర్లక్ష్యతనో శివస్తుతి విధౌకోవాక్ష మేతాంభికే సల్లాపాః
స్తుతయః పదక్షిణ శతం సంచారేవా స్తుతి,సంవేశో మనసస్సహస్రమఖిలంత్వత్ప్రీతయేకల్ప్యతాం!!

౧౬.శ్రీ మంత్రాక్షర మాలయా,గిరిసుతాం,యఃపూజయేచ్ఛేతసా,సంధ్యా సంయతి వాసరం సునియత సస్త్యామలస్యా
చిరాత్ చిత్తాంబోరుహ మంటపే,గిరిసతవృతాం,రసాద్వాణి వక్త్రసరోరుహే,జలధిజాగేహే జగన్మంగళా!!

౧౭.ఇతి గిరివర పుత్రీం పాదరాజీవభూషాం,భువన మమలయంతీ సూక్తి సౌరభ్యసారైఃశివపద మకరంద స్యందినీ            మన్నిబద్దా,మదయత,కవిభృంగా మాతృకా పుష్పమాలా!!

(ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పూజ్య పాద విరచిత మంత్ర మాత్రుకాపుష్ప మాలాత్మక నిత్య మానసిక పూజ సంపూర్ణాః!!)