6, నవంబర్ 2011, ఆదివారం

శ్రీ కాత్యాయని నవరత్న మాలికా స్తవ:


వాణీం జితశుకవాణీ మళికులవేణీం భవాంబుధిద్రోణీమ్
వీణాశుకశిశుపాణిం నతగీర్వాణీం నమామి శర్వాణీమ్


కువలయదళనీలాంగీం కువలయరక్షైక దీక్షీతాసపాంగీమ్
లోచనవిజితకురంగీం మాతంగీం నౌమి శంకరార్థాంగీమ్


కమలాం కమలజకాంతాం కలపారసదత్తకాంతక రకమలామ్
కరయుగళవిధృతకమలాం విమలాంకమలాంక చూడసకల కలామ్


సుందరహిమకరవదనాం కుందసురదనాం ముకుండనిధిసదనామ్
కరుణోజ్జోవితమదనాం సురకుశలాయాసురేషు కృతదమనామ్


అరుణాధరజితబింబాం జగదంబాం గమనవిజిత కాదంబామ్
పాలిత సుతజనకదంబాం పృథులనితం బాం భజే సహేరంబామ్


శరణాగత జనభరణాం కరుణావరుణాల యాబ్జచరణామ్
మణిమయదివ్యభరణాం చరణాంభోజాత సేవకోద్ధరణామ్


తుఙ్గ్ స్తనజితకుంభాం కృతపరిరంభాం శివేన గుహడింభామ్
దారితశుభనిశుంభాం నర్తితరంభాం పురోవిగతదంభామ్


నతజనదీక్షారక్షాం దక్షాం ప్రత్యక్షదైవతాధ్యక్షామ్
వాహీకృతహర్యక్షాంక్షపితవివక్షాంసురేషు కృతరక్షామ్


ధన్యాంసుర వరమాన్యాం హిమగిరికన్యాంత్రిలోకమూర్దన్యామ్
విహృతసురద్రుమవన్యాం వేద్మివినత్వాం న దేవతామన్యామ్


ఫలశృతి
ఏతాం నవమణిమాలాం పఠంతి భక్త్యేహ యే పరాశక్త్యా
తేషాం వదనే సదనే నృత్యతి వాణీ రమా చ పరముముదా

5, అక్టోబర్ 2011, బుధవారం

శ్రీ లలితా నక్షత్రమాలిక


1. శ్రీ భువనేశ్వరి  ఓం లలిత   -        శివకామేశ్వరి  ఓం లలిత    
   త్రిపురసుందరి ఓం లలిత             మా హృదయాంజలి ఓం లలిత 


2.మణిద్వీపవాసిని ఓం లలిత          మందహాసిని ఓం లలిత
  మణీమయభూషిణి ఓం లలిత        మధురభాషిణి ఓం లలిత 


3.జయసరస్వతి ఓం లలిత              జయ ధనలక్ష్మి ఓం లలిత 
 మంగళ గౌరి ఓం లలిత                  బంగారు తల్లి ఓం లలిత 


4.పద్మలోచని ఓం లలిత                 పాపమోచని ఓం లలిత 
  పరమపావనీ ఓం లలిత                 సుజనజీవని ఓం లలిత 


5.అన్నపూర్ణేశ్వరి ఓం లలిత             అర్థనారీశ్వరి ఓం లలిత 
  అఖిలాండేశ్వరి ఓం లలిత              ఆదిపరాశక్తి ఓం లలిత 


6.అభయదాయిని ఓం లలిత            ఐశ్వర్యదాయిని ఓం లలిత 
  ఆరోగ్యదాయిని ఓం లలిత              ఆనందదాయిని ఓం లలిత 


7.శ్రీ మహరాజ్ఞి ఓం లలిత                 సింహసనేశ్వరి ఓం లలిత 
  సురగణపూజిత ఓం లలిత             కీర్తివిరాజిత ఓం లలిత 


8.అజ ఉపేంద్రసుత ఓం లలిత           అమరేంద్రనందిత ఓం లలిత 
  త్రైలోక్యమాత ఓం లలిత                 యాగాగ్ని సంభూత ఓం లలిత 


9.పాశధారిణి ఓం లలిత                    అంకుశధారిణి ఓం లలిత 
  పుండ్రేక్షుధారిణి ఓం లలిత              పూబాణధారిణి ఓం లలిత 


10.మహమంత్రిణి ఓం లలిత            మహతంత్రిణి ఓం లలిత 
    మహ యంత్రిణి ఓం లలిత           మహయోగిని ఓం లలిత 


11.బ్రహ్మ స్వరూపిణి ఓం లలిత        విష్ణురూపిణి ఓం లలిత 
    రుద్రరూపిణి ఓం లలిత                మహ రూపిణి ఓం లలిత 


12.శ్రీ స్వరూపిణి ఓం లలిత              సూక్ష్మరూపిణి ఓం లలిత 
    వేదరూపిణి ఓం లలిత                 నాదరూపిణి ఓం లలిత 


13.కల్పవిహరిణి ఓం లలిత              భండసంహరిణి ఓం లలిత 
    కలుషనివారిణి ఓం లలిత             కళ్యాణకారిణి ఓం లలిత 


14.జయ కమలాసన ఓం లలిత        జయ కమలానన ఓం లలిత
   అనాదినిధనా ఓం లలిత                ఆనందసదనా ఓం లలిత 


15.రాజరాజేశ్వరి ఓం లలిత              రజతగిరీశ్వరి ఓం లలిత 
    అరిభయంకరీ ఓం లలిత           అసురసంహరీ ఓం లలిత 


16.భేదనాశిని ఓం లలిత       మోహనాశిని ఓం లలిత 
    భానుభాసిని ఓం లలిత                  భక్తపోషిణి ఓం లలిత 


17.శ్రీ కనకదుర్గ ఓం లలిత            అంబిక చండిక ఓం లలిత 
    మహిషమర్థిని ఓం లలిత              ధర్మసంవర్థిని ఓం లలిత 


18.జయనారాయణి ఓం లలిత          జయదాక్షాయణి ఓం లలిత 
    దుర్గతినాశిని ఓం లలిత                సద్గతి దాయిని ఓం లలిత 


19.శివాని భవాని ఓం లలిత             శాంభవి శాంకరీ ఓం లలిత 
    సామగానప్రియ ఓం లలిత            సర్వమంగళా ఓం లలిత 


20.త్రినేత్రధారిణి ఓం లలిత                త్రితాపహారిణి ఓం లలిత 
    సరోజ చరణి ఓం లలిత                 భవాబ్ది తరణి ఓం లలిత 


21.జయగాయత్రి ఓం లలిత                జయసావిత్రి ఓం లలిత 
    అమృతవర్షిణి ఓం లలిత          ఆత్మాకర్షిణి ఓం లలిత 


22.సౌభాగ్యదాయిని ఓం లలిత          సౌశీల్యదాయిని ఓం లలిత 
    సంతానదాయిని ఓం లలిత           సంతోషదాయిని ఓం లలిత 


23.జయ పరమేశ్వరి ఓం లలిత         జయవిశ్వేశ్వరి ఓం లలిత 
    దు:ఖ వినాశిని ఓం లలిత        సౌఖ్యప్రదాయిని ఓం లలిత 


24.ఉమామహేశ్వరి ఓం లలిత           చాముండేశ్వరి ఓం లలిత 
    యోగిశ్వరేశ్వరి ఓం లలిత              భక్తి పుష్పాంజలి ఓం లలిత 


25.జయ సువాసిని ఓం లలిత           జయసుమంగళీ ఓం లలిత 
    జయశ్రీదేవి ఓం లలిత                    మా పూజ గైకొను ఓం లలిత 


26.శ్రీ చక్రవాసిని ఓం లలిత                 స్వయం ప్రకాశిని ఓం లలిత 
    మా దోషములను ఓం లలిత           మన్నించుమమ్మా ఓం లలిత 


27.దయా తరంగణి ఓం లలిత             దారిద్ర్య నాశిని ఓం లలిత 
    దయ గనుమమ్మా ఓం లలిత        నీ దాసకోటిని ఓం లలిత 


28.కనులారా లలితను చూడండి       కర్పూర హారతినివ్వండి
    మనసారనామము పలకండి         మన జన్మసార్థకమౌనండి


ఓం లలిత శ్రీ లలితా జయ జయ లలితా 
ఓం లలిత శ్రీ లలితా జయ జయ లలితా 

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

భాషా భోధకులు

స్వర్గ లోకమందు వర్థిల్లు దేవతల్ 
తెలుగు భోధకులుగ ఇలకు వచ్చి 
   అమృత రుచులు త్రాగి అందరకును పంచి 
తిరిగి  పోవుచుండ్రు తృప్తి దివికి 

సేకరణ :శ్రీలలిత 

1, సెప్టెంబర్ 2011, గురువారం

గణపతి కీర్తన


(కళ్యాణి-ఆది)

రచన:శ్రీ రాజశేఖర లక్ష్మీపతి(భాగవతులు)


వారణ వదన! విఘ్ననివారణ!దారికడ్డము రాకురా!

జోహారురా!నగజాకుమార            ||వారణ||

నేరములెంచక భూరికృపారస ధారలకురిపించరా

కరుణాకరా ఆశ్రిత మందార          ||వారణ||

నిజముగ తొలుత నీ పావన పదనీరజము లనారతము

అమలభక్తిమతి భజియించెడు వారికి నిశ్చయముగద

విజయసాధనావకాశము గణపతి

భుజగభూష అసమాన తేజోవిరాజిత

పరిపాలిత లక్ష్మీపతి త్రిజద్వినుత

వరశుభ చరిత ప్రధిత నతగతి

ప్రకట హితమతి ప్రమథ గణపతి   ||వారణ||

14, ఆగస్టు 2011, ఆదివారం

శ్రీ లలిత పరమేశ్వరి ఆలయం వెంకటాపూర్ చిత్ర మాలిక

       నిర్మాణం లో ఉన్నశ్రీ లలిత పరమేశ్వరి ఆలయం వెంకటాపూర్ చిత్ర మాలిక  


గుడి బయటి దృశ్యం 

గుడి బయటి దృశ్యం 


గుడి ముఖ మంటపం పై భాగాన అమ్మవారి విగ్రహం 



గుడి లోపలి డిజైన్

గుడి లోపలి భాగం 


గుడి లోపలి స్తంభాలు 

10, ఆగస్టు 2011, బుధవారం

శ్రీ పాండురంగాష్టకం





మహయోగ పీఠే తటే భీమారాథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రై:
సమాగత్య తిష్టంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||

తటిద్వాససం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశం
వరంత్విష్టికాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||

ప్రమాణం భవాబ్దేరిదం మామాకానాం నితంభ:కరాభ్యాందృతో యేన తస్మాత్
విధాతుర్వసత్త్యె ధృతోనాభికోశ: పరబ్రహ్మలింగం భజే పాండురంగం||

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసం
హరింశాంతమీడ్యం పరంలోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||

శరచ్చంద్ర బింబాననం చారుహాసం లసత్కుండలా క్రాంత గండస్థలాంతం
జపారాగ బింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||

కిరిటోజ్జ్వలత్సర్య దిక్ప్రాంతభాగం సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘై:
త్రిభంగాకృతింబర్హ మాల్యావతంసం పరబ్రహ్మలింగం  భజే పాండురంగం||

గవాంబృందకానందదం చారుహాసం స్వయంలీలయా గోపవేషం దధానం
అజంరుక్మిణీ ప్రాణసంజీవనంతం పరంధామకైవల్య మేకం తురీయం
ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగం||

స్తవం పాండురంగస్య వై పుణ్యదంయే పఠంత్యేకచిత్తేన భక్త్యాచనిత్యం
భావాంభోనిధిం త్యేపి తీర్థ్యంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి||

7, ఆగస్టు 2011, ఆదివారం

విఘ్నేశ హారతి




రచన:  బ్రహ్మ శ్రీ రవీంద్రశర్మ

(ఓం జయ జయ జగదీష్ హరే అను మాదిరి)

ఓం జయ జయ విఘ్నేశ హే ప్రభో   జయ విఘ్నేశ

నత జన సంకట నాశ   ||2||

నిజ జనదు:ఖ వినాశ సకల గణాధీశ

                                                                         || ఓం జయ జయ విఘ్నేశ|| 

సురగురుడోరగ కిన్నర పూజిత పదపద్మా

స్వామి పూజిత పదపద్మా

          పరమేశ్వర కరుణాకర   ||2||

     మునిమానస సద్మా  
          
                                                                        || ఓం జయ జయ విఘ్నేశ|| 

వరదా భయ పాశాంకుశధర పార్వతీ తనయా

స్వామి పార్వతీ తనయా

        వరదాయక మంగళకర    ||2||

పరమ దయా హృదయా

                                                                         || ఓం జయ జయ విఘ్నేశ|| 

మూలాధార విహార యోగి జనోద్ధార

స్వామి యోగి జనోద్ధార

           పరమసుధారసధార     ||2||

ఆనందాకార

                                                                        || ఓం జయ జయ విఘ్నేశ||

శ్రీ హ్రీ కామధరేశ్వర వరదా ప్రియధామా

స్వామి  వరదా ప్రియధామా

   గణనాయక నిధినాయక  ||2||

ప్రియనాయక భూమా

                                                                      || ఓం జయ జయ విఘ్నేశ||

ఖండిత దానవ మండల భక్తజనామోద

స్వామి భక్తజనామోద

          చండీ ప్రియసుత శ్రీదా    ||2||

రవీశ్వరా వరదా

                                                                      || ఓం జయ జయ విఘ్నేశ||
     

16, జులై 2011, శనివారం

శ్రీ శిరిడి సాయిబాబా అష్టకము




(బ్రహ్మ శ్రీ గౌరిభట్ల రఘురామశాస్త్రి గారి చే విరచితం)
----------------------------------------------
శ్రీ రామాకృతి గోవిందాకృతి పరమ శివాకృతి సమభావం
మాయాతీతం భక్తి,సమర్పిత వస్తు ప్రేమ గుణద్యోతం
బాబారూపం ద్వారకనామక మందిర శాంతి కళాదీపం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
--------------------------------------------------
సర్వాంతర సంకల్ప  జ్ఞానసముద్రం దీన దయాముద్రం
సర్వ స్వరూప దర్శన దాన విధాతారం కరుణాపారం
జీవాజ్ఞాన నిశీథాగాధ తమోహర మద్యందిన భానుం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
రోగాతుర విలపన్మనసాం తద్రోగాపహరణం పారీణం
భోగాసక్త జనాంతర భక్తి మతాం వాంఛాతతి దాతారం
యోగానంద మిలన్మానసలసతా మనపాయ తయాసీనం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
శ్రీ రామ సదృశ దర్శన ఘటక మయోధ్యా ధిపపద భక్తానాం
పాండురంగ సమదర్శన దాన ధురీణం విఠళ భక్తానాం
భావానుసార ఫలదం భక్తజనావన కార్యమహమోదం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
శతయోజన గత గోధాబంధు నమాగమవార్తావక్తారం
జన్మత్రయ బంధాగత భుజగగిళిత మండూక విమోక్తారం
భూతగ్రహ మారీ పీడాహరధునియా విభూతి దాతారం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
---------------------------------------------------
బృందావన సమషిరిడి పుర్యాం శ్రీ కృష్ణాకృత సంకాశం
మారుతి సదృశ లసన్మూర్తిం హతాధీనాతుర జనబహుళార్తిం
కాలత్రయ గతి వేత్తారం కల్మషరిపు దుర్గ విభేత్తారం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
----------------------------------------------------
భూత వర్తమాన భావి విజ్ఞం సంకల్పిత కృషి సర్వజ్ఞం
ఆడంబర రహితాచార్యం పరమాధ్బుత మహిమాన్విత చర్యం
స్వాత్మానందను భవోత్తీర్ణం శ్రితవాత్సల్య గుణాకీర్ణం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
వైశ్వానర్పిత తైలథినేజల తైలోజ్వలిత ధునిదీపం
చౌర్యాదిక దుర్గుణ హర్తారం ఫాతకీజన సంస్కర్తారం
బ్రహ్మనంద మహొదధి చంద్రం వాతాతి హర్ష హరణేంద్రం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
--------------------------------------------------
సర్వ శుభావహ తాపస గణపతి వాచక సాయి శుభదనామన్
ఆశ్రిత పాప క్షాలనదీక్షా కష్టజలధి తారణ రక్ష
సాయి మహత్మాష్టక ఫఠితారో సాయి కృపా వీక్షణ లేశాత్
సర్వ సుఖాన్యను భవంతి మిద త్యపి కైవల్య శుభందామ



పద్య వైభవము

పద్యమ్ము నెవడురా పాడుబడ్డదియంచు

              వెర్రివాడై విర్రవాగువాడు?

పద్యమ్ము నెవడురా పాతిపెట్టెదనంచు

             ఉన్మాదియై ప్రేలుచున్నవాడు?

పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పెద్ద

             వృక్షమై పండ్లవేవేల నొసగు

పద్యమ్మునేనాడో పాతిపెట్టితి మేము
 
             లోకుల హృదయాల లోతులందు



ఇప్పుడద్దాని పెకిలింప నెవరితరము?

వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము

నిన్నటికి మొన్న మొన్ననే కన్ను తెరచు

బాల్యచాపల్యమున కెంత వదరుతనము


రచన :అజ్జ్జ్జ్జాత కర్తృకం
సేకరణ: సాయిరామ్ శర్మ 

1, జూన్ 2011, బుధవారం

శ్రీ లలితా పరమేశ్వరి క్షేత్రము,వెంకటాపూర్




           


శ్రీ శ్రీ శ్రీ లలితాదేవ్యైనమ:

శ్రీ శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి,శ్రీ లక్ష్మిగణపతి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయముల నిర్మాణమునకు కార్యోన్ముఖులు అగుటకై

స్వస్తి శ్రీ వ్యయనామ సంవత్సర మాఘశుద్ద సప్తమి తేది 25-01-2007 నాడు శ్రీ శ్రీ శ్రీ లలితాపరమేశ్వరి దేవాలయములకు శంఖస్థాపన జరిగిన శుభసంధర్భాన శ్రీ లలితాసేవాసమితి వారు సమస్త ప్రజలను దేవాలయముల నిర్మాణము కొరకు మన:పూర్వకముగా కోరుచున్నారు.

"అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ: సుదుర్లభ"

అన్నట్లు శ్రీ సోమయాజుల రవీంద్రశర్మ గారికి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి కరుణామయి కావున వారి సంకల్పము కార్యరూపము దాల్చుటకై స్వప్నమందు దర్శనమిచ్చిసహస్రచండీయాగములు జరిపించమని  ఆదేశించడమైనది.స్వప్నాదేశానుసారము సహస్రచండీయాగ నిర్వహణ కార్యక్రమమును భక్తుల సహకారముతో చేయ సంకల్పించిరి.

స్వస్తిశ్రీ ఈశ్వరనామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి (05-05-1997) వేలూరు గ్రామమందు ప్రధమ యాగము ప్రారంభమై 04-01-2001  వరకు అష్టోత్తర శత చండీయాగము(108),అల్లాపూర్ గ్రామ శివారు లో సంపూర్ణమై సహస్ర చండీయాగము   వైపు విజయవంతంగా కొనసాగుతున్న సంధర్బమున 

శ్రీ శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి ప్రేరణచే వెంకటాపూర్ గ్రామము తూప్రాన్ మండలము నందు ఆ గ్రామస్తులచే నిర్మించబదిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవ సంధర్భమున గ్రామ ప్రముఖుల మర్యాదమన్ననలను చూచి వారి ఉత్సాహముతో శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయనిర్మాణమునకై భూదానము కొరకు ప్రస్తావించిన తక్షణమే వారు ఒప్పుకుని స్వస్తిశ్రీ వ్యయనామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి 26-04-2006 రోజు నవమ వార్షికోత్సవ సంధర్భాన జరిగిన 316 వ చండీయాగము  జరిగిన సంధర్భాన గ్రామ ప్రముఖులు బహిరంగంగా భూదానము గావించిరి.

దివి 31-05-2011 వరకు 547 చండీయాగములు పూర్తి అయినవి.

ఎందరో లలితాపరమేశ్వరీ  సేవాభక్తులు చండీయాగములు చేసుకుని సంతానము లేనివారు సంతానము పొందినారు.కోరిన కోర్కెలు తీర్చుమని కోరిన వారికి అమ్మవారు కొంగుబంగారమై ఉన్నది.
నిర్మాణములో ఉన్న ఆలయ ముఖద్వారము

వెంకటాపురం నందు శ్రీ లలితా పరమేశ్వరి,శ్రీ లక్ష్మీ గణపతి మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయముల నిర్మాణములు కొనసాగుచున్న మహత్కార్యములో భక్తుల దేవాలయముల నిర్మాణము మరియు యజ్ఞశాల,భోజనశాల,సాంస్కృతిక కళావేదిక,ఉద్యానవనముల నిర్మాణమునకు ధనరూపేణ గాని,వస్తురూపేణగాని తమ శక్త్యనుసారముగా ఇతోధిక సహయ సహకారములు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

మెదక్ జిల్లాలోనే అత్యంత ప్రముఖ దేవాలయముగా విరాజిల్లుటకై తోడ్పడగలరని మా ఆకాంక్ష.



శ్రీ లలితా సేవా సమితి
సోమయాజుల రవీంద్రశర్మ

దేవి ఉపాసకులు
వాస్తు,జ్యోతిష్యం
ప్రదాన కార్యాలయము
శ్రీ బాలాంజనేయస్వామి దేవాలయము
తూప్రాన్
E-mail id: s.ravindra.sharma@gmail.com



7, మే 2011, శనివారం

మోము అందం


మోము అందం


లోకానికి నుపరిచితం

కాని మనసు అందం


ఎవరికి సుపరిచితం


అది మనసు గలవారికి


మాత్రమే సుపరిచితం

26, ఏప్రిల్ 2011, మంగళవారం

అశ్రునివాళి






నీవే జీవితమనుకున్నాను

నీవే దైవమనుకున్నాను

సేవే పరమార్థమనుకున్నాను

కరుణయే ముఖ్యమనుకున్నాను

కాని దైవమే దేహం వదిలి పోతే

భరించలేకున్నా బాబా

అశ్రువులతో కడసారి వీడ్కోలు

11, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీ రామ హరతి

శ్రీ రామ హరతి
రచన : బ్రహ్మ శ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి
(ఏమివ్వను నీకేమివ్వను-అనుమాదిరి)


నీ నామము మంగళధామము
ఓ శ్రీ రామ తారకమే నీ స్మరణము
|| నీ నామము ||

పావన సరయూతీరవిహారము-నీకే మోదము
నీ పదము జేరు వరమౌనుల హృదయము-నీ హృదయము
పవనాత్మజుడే భజించు-చరణము
పతితపావనా మాకే-శరణము
|| నీ నామము ||

భూజాత మనమ్ములోని దీపము-నీ రూపము
రాజధరుని రామాయణ గానము-కరుణ నిధానము
గజవరదా నీ శుభ కళ్యాణము
ఈ భక్తుల దీన జనోద్దరణము
|| నీ నామము ||

31, మార్చి 2011, గురువారం

ఉగాది పర్వదినం


నిషస్సు నెక్కె ఉషస్సు ఎదపై చెక్కిన యశశ్శిల్పమే
" ఈ యుగాది"
అరిషడ్వర్గపు అరిహస్తాలను ఖండించే సూర్యకిరణపు
కరవాలాలను నిలిపిన వేదిక
"ఈ యుగాది"
వికృతి నామపు విపరీతాలను
విశేషాలను తనలో నుంచిన
ఖర నామపు స్వాగత తోరణం
"ఈ యుగాది"
ఉత్పలమాలను చంపకమాలను మెడను ధరించి
మత్తేభమ్ముల,శార్ధూలమ్ముల వాహనమ్ముల గావించి
కోటి కోకిలల కుహుగానములను
నాదస్వరముల గానముల మేళవించి
ప్రశాంత ప్రాగ్వేదికపై
ఉషాకిరణాల దిశారాగమే
" ఈ యుగాది"
షట్శాస్ర్తమ్ముల సారమ్ములను
షడ్రుచులుగా మలిచి
దశాదిశావేదికపై ఉదయించు
నవగ్రీష్మ తేజమే
"ఈ యుగాది"

19, ఫిబ్రవరి 2011, శనివారం

సుడి గొని రామ పాదము