16, జులై 2011, శనివారం

శ్రీ శిరిడి సాయిబాబా అష్టకము

(బ్రహ్మ శ్రీ గౌరిభట్ల రఘురామశాస్త్రి గారి చే విరచితం)
----------------------------------------------
శ్రీ రామాకృతి గోవిందాకృతి పరమ శివాకృతి సమభావం
మాయాతీతం భక్తి,సమర్పిత వస్తు ప్రేమ గుణద్యోతం
బాబారూపం ద్వారకనామక మందిర శాంతి కళాదీపం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
--------------------------------------------------
సర్వాంతర సంకల్ప  జ్ఞానసముద్రం దీన దయాముద్రం
సర్వ స్వరూప దర్శన దాన విధాతారం కరుణాపారం
జీవాజ్ఞాన నిశీథాగాధ తమోహర మద్యందిన భానుం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
రోగాతుర విలపన్మనసాం తద్రోగాపహరణం పారీణం
భోగాసక్త జనాంతర భక్తి మతాం వాంఛాతతి దాతారం
యోగానంద మిలన్మానసలసతా మనపాయ తయాసీనం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
శ్రీ రామ సదృశ దర్శన ఘటక మయోధ్యా ధిపపద భక్తానాం
పాండురంగ సమదర్శన దాన ధురీణం విఠళ భక్తానాం
భావానుసార ఫలదం భక్తజనావన కార్యమహమోదం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
శతయోజన గత గోధాబంధు నమాగమవార్తావక్తారం
జన్మత్రయ బంధాగత భుజగగిళిత మండూక విమోక్తారం
భూతగ్రహ మారీ పీడాహరధునియా విభూతి దాతారం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
---------------------------------------------------
బృందావన సమషిరిడి పుర్యాం శ్రీ కృష్ణాకృత సంకాశం
మారుతి సదృశ లసన్మూర్తిం హతాధీనాతుర జనబహుళార్తిం
కాలత్రయ గతి వేత్తారం కల్మషరిపు దుర్గ విభేత్తారం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
----------------------------------------------------
భూత వర్తమాన భావి విజ్ఞం సంకల్పిత కృషి సర్వజ్ఞం
ఆడంబర రహితాచార్యం పరమాధ్బుత మహిమాన్విత చర్యం
స్వాత్మానందను భవోత్తీర్ణం శ్రితవాత్సల్య గుణాకీర్ణం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
-----------------------------------------------------
వైశ్వానర్పిత తైలథినేజల తైలోజ్వలిత ధునిదీపం
చౌర్యాదిక దుర్గుణ హర్తారం ఫాతకీజన సంస్కర్తారం
బ్రహ్మనంద మహొదధి చంద్రం వాతాతి హర్ష హరణేంద్రం
సేవే మమహృది నిత్యం సాయి మహాత్మానం పరమాత్మానాం
--------------------------------------------------
సర్వ శుభావహ తాపస గణపతి వాచక సాయి శుభదనామన్
ఆశ్రిత పాప క్షాలనదీక్షా కష్టజలధి తారణ రక్ష
సాయి మహత్మాష్టక ఫఠితారో సాయి కృపా వీక్షణ లేశాత్
సర్వ సుఖాన్యను భవంతి మిద త్యపి కైవల్య శుభందామ

పద్య వైభవము

పద్యమ్ము నెవడురా పాడుబడ్డదియంచు

              వెర్రివాడై విర్రవాగువాడు?

పద్యమ్ము నెవడురా పాతిపెట్టెదనంచు

             ఉన్మాదియై ప్రేలుచున్నవాడు?

పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పెద్ద

             వృక్షమై పండ్లవేవేల నొసగు

పద్యమ్మునేనాడో పాతిపెట్టితి మేము
 
             లోకుల హృదయాల లోతులందు

ఇప్పుడద్దాని పెకిలింప నెవరితరము?

వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము

నిన్నటికి మొన్న మొన్ననే కన్ను తెరచు

బాల్యచాపల్యమున కెంత వదరుతనము

రచన :అజ్జ్జ్జ్జాత కర్తృకం
సేకరణ: సాయిరామ్ శర్మ