1, జూన్ 2011, బుధవారం

శ్రీ లలితా పరమేశ్వరి క్షేత్రము,వెంకటాపూర్




           


శ్రీ శ్రీ శ్రీ లలితాదేవ్యైనమ:

శ్రీ శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి,శ్రీ లక్ష్మిగణపతి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయముల నిర్మాణమునకు కార్యోన్ముఖులు అగుటకై

స్వస్తి శ్రీ వ్యయనామ సంవత్సర మాఘశుద్ద సప్తమి తేది 25-01-2007 నాడు శ్రీ శ్రీ శ్రీ లలితాపరమేశ్వరి దేవాలయములకు శంఖస్థాపన జరిగిన శుభసంధర్భాన శ్రీ లలితాసేవాసమితి వారు సమస్త ప్రజలను దేవాలయముల నిర్మాణము కొరకు మన:పూర్వకముగా కోరుచున్నారు.

"అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ: సుదుర్లభ"

అన్నట్లు శ్రీ సోమయాజుల రవీంద్రశర్మ గారికి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి కరుణామయి కావున వారి సంకల్పము కార్యరూపము దాల్చుటకై స్వప్నమందు దర్శనమిచ్చిసహస్రచండీయాగములు జరిపించమని  ఆదేశించడమైనది.స్వప్నాదేశానుసారము సహస్రచండీయాగ నిర్వహణ కార్యక్రమమును భక్తుల సహకారముతో చేయ సంకల్పించిరి.

స్వస్తిశ్రీ ఈశ్వరనామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి (05-05-1997) వేలూరు గ్రామమందు ప్రధమ యాగము ప్రారంభమై 04-01-2001  వరకు అష్టోత్తర శత చండీయాగము(108),అల్లాపూర్ గ్రామ శివారు లో సంపూర్ణమై సహస్ర చండీయాగము   వైపు విజయవంతంగా కొనసాగుతున్న సంధర్బమున 

శ్రీ శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి ప్రేరణచే వెంకటాపూర్ గ్రామము తూప్రాన్ మండలము నందు ఆ గ్రామస్తులచే నిర్మించబదిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవ సంధర్భమున గ్రామ ప్రముఖుల మర్యాదమన్ననలను చూచి వారి ఉత్సాహముతో శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయనిర్మాణమునకై భూదానము కొరకు ప్రస్తావించిన తక్షణమే వారు ఒప్పుకుని స్వస్తిశ్రీ వ్యయనామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి 26-04-2006 రోజు నవమ వార్షికోత్సవ సంధర్భాన జరిగిన 316 వ చండీయాగము  జరిగిన సంధర్భాన గ్రామ ప్రముఖులు బహిరంగంగా భూదానము గావించిరి.

దివి 31-05-2011 వరకు 547 చండీయాగములు పూర్తి అయినవి.

ఎందరో లలితాపరమేశ్వరీ  సేవాభక్తులు చండీయాగములు చేసుకుని సంతానము లేనివారు సంతానము పొందినారు.కోరిన కోర్కెలు తీర్చుమని కోరిన వారికి అమ్మవారు కొంగుబంగారమై ఉన్నది.
నిర్మాణములో ఉన్న ఆలయ ముఖద్వారము

వెంకటాపురం నందు శ్రీ లలితా పరమేశ్వరి,శ్రీ లక్ష్మీ గణపతి మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయముల నిర్మాణములు కొనసాగుచున్న మహత్కార్యములో భక్తుల దేవాలయముల నిర్మాణము మరియు యజ్ఞశాల,భోజనశాల,సాంస్కృతిక కళావేదిక,ఉద్యానవనముల నిర్మాణమునకు ధనరూపేణ గాని,వస్తురూపేణగాని తమ శక్త్యనుసారముగా ఇతోధిక సహయ సహకారములు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

మెదక్ జిల్లాలోనే అత్యంత ప్రముఖ దేవాలయముగా విరాజిల్లుటకై తోడ్పడగలరని మా ఆకాంక్ష.



శ్రీ లలితా సేవా సమితి
సోమయాజుల రవీంద్రశర్మ

దేవి ఉపాసకులు
వాస్తు,జ్యోతిష్యం
ప్రదాన కార్యాలయము
శ్రీ బాలాంజనేయస్వామి దేవాలయము
తూప్రాన్
E-mail id: s.ravindra.sharma@gmail.com