29, నవంబర్ 2013, శుక్రవారం

సోమవతి అమావాస్య



అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని,ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.

అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి,"సముద్రాలను దాటడమెలాగా?" అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి  ఒక పండు వారి మద్యన పడింది..అన్నాచెఅన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి.అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.

అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి,ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,"ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?" అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు.చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు.వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తోత్రం చేశారు.

కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది.దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినత్లుగా లేచి కూర్చున్నారు.

పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది. 

విధానం:ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి.అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.

శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ | మద్యతో విష్ణురూపిణే |
అగ్రత శ్శివరూపాయ | వృక్షరాజాయతే నమ: |

అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండో ఫలమో,మణో,మాణిక్యమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి.అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపన: అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత,
వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి,బంగారంతో (యధాశక్తి) నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి,108 కలశాలను
స్థాపించి ఆరాధించాలి.ఆఖరున మండపాన్ని,కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి.ముత్తయిదువలకు 108 ఫలాలను గాని,రత్నాలను గాని వాయనదానమివ్వాలి.

గమనిక : ఈ కార్తీక మాస అమావాస్య సోమవారము తో కూడిన అమావాస్య కావడం విశేషం    

1, మార్చి 2013, శుక్రవారం

శ్రీ అర్థనారీశ్వర స్తుతి



చాంపేయగౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమ్మిల్లకాయైచ జటాధరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ:పుంజవిచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

ఝణత్ క్వణత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

మందారమాలాకలితాలకైయ కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయైచ దిగంబరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

అంభోధర శ్యామలకుంతలకాయై తటిత్ ప్రభాతమ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త్ సంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమశ్శివాయైచ నమశ్శివాయ||

ప్రదీప్త రత్నోజ్జ్వలకుండలాయై స్పురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయైచ శివాన్వితాయ నమశ్శివాయైచ నమశ్శివాయ||

ఏతత్ పఠేదష్టకమిష్టదం యో భక్త్యాసమాన్యో భువిధన్యజీవి
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదాచాస్య సమస్త సిద్ధి:||

15, డిసెంబర్ 2012, శనివారం

స్వాగత సుమాంజలి

27, నవంబర్ 2012, మంగళవారం

కార్తీక సోమవార వ్రతము






వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన 
సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్దగా ఆలకించండి
ఈ నెలలో శివ ప్రీతిగా సోమవార వ్రతమాచరించేవాడు తప్పనిసరిగా
కైలాసాన్ని చేరుకుంటాడు.కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము 
నాడయిన సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి
అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు.
ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంది
౧.ఉపవాసము
౨.ఏకభుక్తము
౩.నక్తము 
౪.అయాచితము
౫.స్నానము
౬.తిలదానము

౧.ఉపవాసము
శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసముతో
గడిపి,సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనాంతరమున
తులసీతీర్థము మాత్రమే స్వీకరించాలి.

౨.ఏకభుక్తము
సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నాన దాన జపాదులను యధావిధిగా 
చేసికొని మధ్యాహ్నమున భోజనం చేసి.రాత్రి భోజనానికి బదులు
శైవతీర్థమో,తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

౩.నక్తము 
పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనము గాని
ఉపాహారమును గాని స్వీకరించాలి.

౪.అయాచితము
భోజనానికై తాము ప్రయత్నించకుండా యెవరైనా వారికి వారుగా 
పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము.

౫.స్నానము
పై వాటికి వేటికి శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నాన జపాదులు
చేసినప్పటికిని చాలును 

౬.తిలదానము
మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు
నువ్వులను దానము చేసినా సరిపోతుంది

పై ఆరు పద్ధతులలో దేనినాచరించినా కార్తిక సోమవార వ్రతము చేసినట్లే
అవుతుంది.ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు
సాయుజ్యమును పొందుతారు.కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము 
నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనము అనంతరము
భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవారు తప్పనిసరిగా 
శివ సాయుజ్యాన్ని పొందుతారు..

6, నవంబర్ 2012, మంగళవారం

వజ్ర పంజర దుర్గా కవచము


శ్లో|| నమోదేవి ! జగద్ధాత్రి: జగత్రయ మహారణే
మహేశ్వరీ:మహాశక్తే:దైత్యదృమ కుఠారికే

''త్రైలోక్యవ్యాపిని:శివే:శంఖ చక్ర గదాధరి
స్వశార్జవగ్ర హస్తాగ్రే: నమో విష్ణు స్వరూపిణి

   ''హంసయానే: నమస్తుభ్యం-సర్వసృష్టి విధాయిని
ప్రాచాం వాచాం జన్మభూమే చతురానన రూపిణి

 ''త్వమైంద్రి! త్వంచకౌబేరి - వాయవీత్వం త్వమంబుపా
త్వం యామీ నైరృతి త్వంచ త్వమైశీ! త్వంచ పావకీ

''శశాంక కౌముదీ త్వంచ - సౌరశక్తి స్త్వమేవచ
                      సర్వదేవమయీ శక్తి:త్వమేవ పరమేశ్వరి                     5


శ్లో||త్వం గౌరి త్వంచ సావిత్రి త్వం గాయత్రి సరస్వతీ
  ప్రకృతి స్వ్తం మతిస్త్వంచ- త్వం మహాకృతి రూపిణి

''చేత:స్వరూపిణి త్వం వై- త్వం సర్వేంద్రియ రూపిణి
పంచతత్వ్త స్వరూపాత్వం - మహాభూతాత్మికాంబికే

''శబ్దాది రూపిణి త్వంవై- కరుణానుగ్రహదాయినీ
బ్రహ్మండ కర్త్రీ త్వందేవి - బ్రహ్మాండాంత స్త్వమేవ హి 

''త్వం పరాసి మహాదేవి !త్వంచదేవి !పరా౭పరా
పరా౭పరాణాం పరమా!పరమాత్మ స్వరూపిణి 

''సర్వరూపాత్వమీశాని!త్వమరూపాసి సర్వగే
                త్వంచిచ్ఛక్తిర్మహామాయే - త్వం స్వాహాత్వం స్వధామృతే             10

''వషడ్వౌషట్ స్వరూపాసి ­- త్వమేవ ప్రణవాత్మికా
సర్వమంత్రమయీ త్వంవై­- బ్రహ్మద్యస్త్వత్సముద్భవా:

శ్లో||చతుర్వర్గత్మికా త్వంవై- చతుర్వర్గ ఫలోదయే
త్వత్త:సర్వమిదం విశ్వం - త్వయి సర్వం జగన్నిధే

''యద్ద్రృశ్యం యదదృశ్యంచ- స్థూల సూక్ష్మ స్వరూపత:
తత్రత్వం శక్తి రూపేణ - కించిన్న త్వదృతే క్వచిత్

''మాత స్త్వయాద్య వినిహత్య మహా సురేంద్రమ్
దుర్గం నిసర్గ విబుధార్పిత దైత్య సైన్యమ్ 
త్రాతా:స్మదేవి !సతతం- నమతాం శరణ్యే
త్వత్తోపర:కఇహ యం శరణం వ్రజామ:

''లోకేత ఏవ ధనధాన్య్ సమృద్ధి భాజ:
తేపుత్ర పౌత్ర సుకళత్ర సుమిత్ర వంత:
తేషాం యశ: ప్రసర చంద్ర కరావదాతమ్
                           విశ్వంభవేద్భవసి యేషు సుదృక్ త్వమీశే                    15

''త్వద్భక్తి చేతసి జనేన విపత్తి లేశ:
కేశ:క్వవాసు భవతీ నతికృత్సు పుంసు
త్వన్నామ సంసృతి జుషాం సకలాయుషాం క్వ
భూయ: పునర్జనిరిహ త్రిపురారి పత్ని

''చిత్రం యదత్ర సమరే సహి దుర్గదైత్య:
త్వదృష్టిపాత మధిగమ్య సుధానిదానమ్
మృత్యోర్మశత్వ మగమ ద్విదితం భవాని
దుష్టోపి తే దృశిగత: కుగతిం నయాతి

''తచ్చస్త్ర వహ్ని శలభత్వ మితా అపీహ
దైత్యా:పతంగ రుచి మాప్య దివం వ్రజంతి
సంత: ఖలేష్వపిన దుష్టధియో యత:స్యు:
సాధుష్వివ ప్రణయిన:స్వపథం దిశంతి 

''ప్రాచ్యాం మృడాణి! పరిపాహి!సదా నతాన్నో
యామ్యా మవ!ప్రతిపదం విపదో భవాని!
ప్రత్యగ్దిశి త్రిపురతా వనపత్ని!రక్ష!
త్వంపాహ్యు దీచిహే నిజభక్త జనాన్మహేశి

''బ్రహ్మణి ! రక్ష! సతతం- నతమౌళి దేశమ్
త్వం వైష్ణవి ! ప్రతికులం పరిపాలయాధ:
రుద్రాగ్ని!నైరృతి సదాగతి దిక్షుపాంతు
                          మృత్యుంజయాత్రి నయన! త్రిపురాత్రి శక్త్య:                20

''పాతు త్రిశూల మమలే తవమౌళి జాన్నో
ఫాలస్ధలం శశికళా భృదుమాభృవౌచ
నేత్రే త్రిలోచన వధూర్గిరిజాచ నాసామ్
ఓష్ఠం జయాచ విజయా త్వధర ప్రదేశమ్

''శ్రోత్రద్వయం శృతిరవా దశనా వళీం శ్రీ
చండీ కపోళ యుగళం,రసనాంచ వాణీ
పాయాత్ సదైవ చుబుకం,జయ మంగళాన:
కాత్యాయనీ వదన మండల  మేవ సర్వమ్

''కంఠప్రదేశమవతా దిహ నీలకంఠీ !
భూదార శక్తిరనిశంచ కృకాటికాయామ్
కౌర్త్మ్యం సదేశమనిశం భుజదండ మైంద్రీ
పద్మాచ పాణి ఫలకం,నతికారిణాం న

''హస్తాంగుళీ :కమలజా విరజానహాంశ్చ
కక్షాంతరం తరణి మండలగా తమోఘ్ని
వక్ష:స్థలం స్థలచరీ,హృదయం ధరిత్రీ
కుక్షి ద్వయం త్వవతు న:క్షణదా చరఘ్నీ

''అవ్యాత్ సదోదరదరీం జగదీశ్వరీ నో
నాభిం నభోగతి రజాత్వధ పృష్ఠదేశమ్
పాయాత్కటించ వికటా,పరమాస్పదౌ నో
                             ఊహ్యంగుహరణి రపాన మపాయ హంత్రీ                       25

''ఊరుద్వయంచ విపులా లలితాచజాను
జంఘే జవావతు కఠోర తరాత్ర గుల్భౌ
గుల్భౌరసాతల చరాంగుళీ దేశముగ్రా
చాంద్రీ నఖాన్ పదతలం తలవాసినీచ

శ్లో|| గృహం రక్షతు నో లక్ష్మీ క్షేత్రం క్షేమకరీ సదా
పాతు పుత్రాన్ ప్రియకరీ పాయాదాయు: సనాతనీ

''యశ:పాతు మహాదేవి ధర్మం పాతు ధనుర్థరీ
కులదేవి కులం పాతు సద్గతిం సద్గతి ప్రదా

''రణే రాజకులే ద్యూతే సంగ్రామే శత్రుసంకటే 
                          గృహే వనే జలాదౌ చ శర్వాణీ సర్వతో౭వతు                   29

ఫల శృతి:

శ్లో|| ఏతత్ స్తోత్రస్య కవచం - పరిధాస్యతి యోనర:
తస్య క్వచిద్వయం నాస్తి - వజ్ర పంజర గస్య హి

''అనయాకవచం కృత్వా - మాబిభేతు యమాదపి
భూతప్రేత పిశాచాశ్చ- శాకిని ఢాకినీ గణా:

''వాత పిత్తాది జనితా: -తథాచ విషమ జ్వరా:
దూరదేవ పలాయంతే -శృత్వాస్తుతి మిమాం శుభామ్

''వజ్రపంజరనామైతత్- స్తోత్రం దుర్గా ప్రశంసనమ్
ఏతత్ స్తోత్ర కృతత్రాణే - వజ్రాదపి భయం నహి

''అష్టజప్తేన చానేన - యోభిమంత్ర్య జలం పిభేత్
తస్యోదరగతా పీడా- క్వాపినో సంభవిష్యతి

''గర్భపీడాతు నోజాతు - భవిష్యత్యభి మంత్రణాత్
బాలానాం పరమా శాంతి : ఏతత్ స్తోత్రంబు పానత: