రచన: బ్రహ్మ శ్రీ రవీంద్రశర్మ
(ఓం జయ జయ జగదీష్ హరే అను మాదిరి)
ఓం జయ జయ విఘ్నేశ హే ప్రభో జయ విఘ్నేశ
నత జన సంకట నాశ ||2||
నిజ జనదు:ఖ వినాశ సకల గణాధీశ
|| ఓం జయ జయ విఘ్నేశ||
సురగురుడోరగ కిన్నర పూజిత పదపద్మా
స్వామి పూజిత పదపద్మా
పరమేశ్వర కరుణాకర ||2||
మునిమానస సద్మా
|| ఓం జయ జయ విఘ్నేశ||
వరదా భయ పాశాంకుశధర పార్వతీ తనయా
స్వామి పార్వతీ తనయా
వరదాయక మంగళకర ||2||
పరమ దయా హృదయా
|| ఓం జయ జయ విఘ్నేశ||
మూలాధార విహార యోగి జనోద్ధార
స్వామి యోగి జనోద్ధార
పరమసుధారసధార ||2||
ఆనందాకార
|| ఓం జయ జయ విఘ్నేశ||
శ్రీ హ్రీ కామధరేశ్వర వరదా ప్రియధామా
స్వామి వరదా ప్రియధామా
గణనాయక నిధినాయక ||2||
ప్రియనాయక భూమా
|| ఓం జయ జయ విఘ్నేశ||
ఖండిత దానవ మండల భక్తజనామోద
స్వామి భక్తజనామోద
చండీ ప్రియసుత శ్రీదా ||2||
రవీశ్వరా వరదా
|| ఓం జయ జయ విఘ్నేశ||
2 కామెంట్లు:
బావుందండి.
కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి