(కళ్యాణి-ఆది)
రచన:శ్రీ రాజశేఖర లక్ష్మీపతి(భాగవతులు)
వారణ వదన! విఘ్ననివారణ!దారికడ్డము రాకురా!
జోహారురా!నగజాకుమార ||వారణ||
నేరములెంచక భూరికృపారస ధారలకురిపించరా
కరుణాకరా ఆశ్రిత మందార ||వారణ||
నిజముగ తొలుత నీ పావన పదనీరజము లనారతము
అమలభక్తిమతి భజియించెడు వారికి నిశ్చయముగద
విజయసాధనావకాశము గణపతి
భుజగభూష అసమాన తేజోవిరాజిత
పరిపాలిత లక్ష్మీపతి త్రిజద్వినుత
వరశుభ చరిత ప్రధిత నతగతి
ప్రకట హితమతి ప్రమథ గణపతి ||వారణ||
1 కామెంట్‌లు:
శ్రీలలిత గారు, బాగా వ్రాసారండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి