19, మే 2012, శనివారం

ప్రహేళిక



"సమాధానం కనుగొనండి"


కేశవం పతితం దృష్ట్వా పాండవా:హర్షనిర్భర:
రుదంతి కౌరవాస్సర్వే హా హా కేశవ కేశవా




1 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

"కేశవుడు అనగా శ్రీకృష్ణుడు పడిపోవటం చూచి పాండవులు చాలా సంతోషించారట,
కౌరవులు విపరీతంగా ఏడ్చారట" ఇది ఈ ప్రహేళిక యొక్క ప్రత్యక్ష అర్థం కాని దాని నిగూడార్థం ఇది
"కే శవమ్ = ఆ శవాలను (అర్జునుని భాణ ఘాతానికి దూరంగా వెళ్ళి నీటి ప్రవాహంలో)
పతితమ్ = పడుతున్న కౌరవ వీరుల శవాలను
దృష్ట్వా = చూచి
పాండవా:=పాండవులు
హర్ష నిర్భర:=పట్టలేని సంతోషాన్ని పొందుతున్నారు.
హా హా కే శవ కే శవ=అయ్యొ శవాలు శవాలు
కౌ రవ:=కౌ అను రవము చేయునవి(నక్కలు)
స్సర్వే=అన్ని
రుదంతి=దు:ఖించుచున్నవి

భావం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని భాణ ఘాతానికి దూరంగా వెళ్ళి సరస్వతి నది ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న కౌరవ సైన్యంలోని వారి శవాలను చూచి పాండవులు పట్టరాని ఆనందాని పొందారు.ఆ శవలు నీటి ప్రవాహంలో పడి కొట్టుకు పోతూ తమకు భుజించటానికి దొరకడం లేదని నక్కలు రోదిస్తున్నవి.

By-S.Sairam sharma

కామెంట్‌ను పోస్ట్ చేయండి