17, జూన్ 2012, ఆదివారం

ప్రహేళిక-2


సమాధానం కనుగొనండి


1.అంచిత చతుర్థజాతుడు
   పంచమ మార్గమున నేగి
   ప్రధమ తనూజన్
   గాంచి తృతీయం బక్కడ 
   నుంచి ద్వితీయంబు దాటి
   యొప్పుగ వచ్చెన్




2.నక్షత్రము గల చిన్నది
   నక్షత్రము చేత బూని నక్షత్ర ప్రభున్
   నక్షత్రమునకు రమ్మని 
   నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్

2 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

మొదటిపద్యంలో పంచభూతాల గురించి మాట్లాడారు. పంచభూతాలలో నాల్గవదైన వాయుపుత్రుడైన హనుమంతుడు ఐదవదైన ఆకాశమార్గంలో మొదటిదైన భూమి కుమార్తె సీతను లంకానగరంలో చూసి, అక్కడ మూడవదైన అగ్నిని నింపి( లంకా దహనం) రెండవదైన నీరు (సాగరాన్ని) దాటి వచ్చాడు..


అభిమన్యుడు యుద్దరంగములోకి వెళ్ళే సమయంలో ఆతని భార్య వీర తిలకం దిద్దేవేళ
నక్షత్రము గల చిన్నది - తన పేరులొ నక్షత్రమున్న చిన్నది. ఉత్తరా
నక్షత్రము చేతబట్టి - భరణీని..,కుంకుమ పాత్రను చేతబట్టి
నక్షత్ర ప్రభు - నక్షత్రములకు ప్రభువైన చంద్రవంశపు ప్రభువు అభిమన్యుని
నక్షత్రమునకు రమ్మని - ఒక మూలా కు రమ్మని
నకత్రము పైన వేసి - .హస్త మును పైన వేసి
నాధునిపిలిచెన్ - పతియగు అభిమన్యుని పిలిచింది.

Unknown చెప్పారు...

జ్యోతి గారు మీ సమాధానం సరియైనది

కామెంట్‌ను పోస్ట్ చేయండి